NTR: జగ్గయ్యపేట పట్టణంలోని చిల్లకల్లు రోడ్డులో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలకు శనివారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. ప్రేమ, శాంతి, కరుణ, క్షమాపణ, తదితర ఉత్తమ గుణాలను ప్రతి ఒక్కరూ పెంపొందించేందుకు ఈ మహోత్సవాలు దోహదపడతాయని అన్నారు.