కోనసీమ: ఆలమూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ అధికారులు అక్టోబర్, నవంబర్ నెలలో నిర్వహించిన దాడుల్లో నాట్టు సారా, అక్రమ మద్యం విక్రయిస్తున్న 12 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేసినట్లు ఆలమూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐడి నాగేశ్వరరావు తెలిపారు. 42 లీటర్ల నాటు సారా 19 లీటర్లు అనధికార మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.