ASR: అరకులోయ మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి పర్యటకులతో అరకు సందర్శనకు వస్తున్న కారు అదుపుతప్పి బెంజిపుర్ పానిరంగని మధ్య కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పర్యటకులకు తీవ్ర గాయాలు కాగా 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం వేగమే అని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.