VZM: విజయనగరంలో పలు చోట్ల చలిలో నిద్రిస్తున్న నిరాశ్రయులకు ఆదివారం వేకువజామున లిఫ్టింగ్ హాండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కంది గౌరీ శంకర్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.