BPT: బాపట్ల జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్గా భావన నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె త్వరలోనే బాపట్లలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా కలెక్టర్కు సహాయకులుగా కీలకమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆమె పాలుపంచుకోనున్నారు. జిల్లా పరిపాలనలో మరింత పారదర్శకత, వేగం పెంచడానికి ఈ నియామకం దోహదపడనుంది.