SKLM: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఆదివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. హైవేపై ప్రయాణించే టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్ లేని వాహనాదారులకు అపరాధ రుసుము వేసినట్లు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ వాహనానికి నంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు. ఆయనతో పోలీసు సిబ్బంది ఉన్నారు.