MBNR: దేశంలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దొంగ ఓట్లతోనే గెలిచిందని విమర్శించారు. బీజేపీ అవినీతి రహిత పాలన అందిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం అహర్నిహలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.