ASR: ఈనెల 23వ తేదీన అరకు లోయలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు పాంచిపేట చిన్నస్వామి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పాచి పెంట శాంత కుమారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి మరియు గిరిజన హక్కులు చట్టాల కోసం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.