VZM: గజపతినగరం మండల పరిషత్ సవరణ అంచనా బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శనివారం గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. 2024 -25 సవరణ బడ్జెట్, 2025- 26 అంచనా బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. జెడ్పీటీసీ గార తౌడు, ఎంపీడీవో కళ్యాణి ఏవో పుష్ప వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.