ఏలూరు జిల్లాను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో 2 రాష్ట్రస్థాయి, 51 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను సోమవారం అందజేశారు. రానున్న స్వచ్ఛ అవార్డుల నాటికి రెట్టింపు స్థాయి అవార్డులను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.