W.G: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం పాలకొల్లులో జిల్లా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. రిటైర్డ్ జడ్జి జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు.