PLD: నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో హెచ్‌డీఎస్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆసుపత్రిని మెడికల్ కళాశాలగా అభివృద్ధి చేస్తామని వారు హామీ ఇచ్చారు. నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, వైద్య సేవలు మెరుగుపరచాలని సూచించారు.