కృష్ణా: కంకిపాడు మండలంలోని ఉప్పులూరు బరిలో పందేల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. పందెం బరిలో జరిగిన చిన్నపాటి వివాదం క్రమంగా పెద్దదిగా మారి, యువకులు ఇరువర్గాలుగా విడిపోయి పరస్పరం కొట్లాటకు దిగారు. ఒక్కసారిగా అరుపులు, కేకలతో బరి ప్రాంతం దద్దరిల్లింది. హోరాహోరీగా జరిగిన దాడులతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.