NLR: దుత్తలూరు మండల కేంద్రంలో పలు మండలాలకు చెందిన ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఆదివారం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనల్లో డ్రైవింగ్ సమయంలో కునుకు తీస్తే అలెర్ట్ సైరన్ మోగడం, నీడను బట్టి సమయాన్ని తెలపడం, స్పీడ్ బ్రేకర్స్ వద్ద డేంజర్ లైట్ వెలగడం, గణిత ఫార్ములాలు, భూకంప సూచనలు తెలిపే విధానం తదితర ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.