ప్రకాశం: నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద, తాగిన మైకంలో రైలు పట్టాలపై పడిపోయిన ఒంగోలుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి రైలు ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. ఒకటో ప్లాట్ఫాం వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నాగరాజు మద్యం మత్తులో పట్టాలపై పడటంతో రైలు ఢీకొట్టింది. రైల్వే సిబ్బంది వెంటనే అతన్ని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు