సత్యసాయి: ఏబీసీడబ్ల్యూఈవోలు, డీబీసీడబ్ల్యూఈవోలు, ఎంజేపీ కన్వీనర్లు తరుచూ తమ పరిధిలో ఉన్న హాస్టళ్లను, గురుకులాలను సందర్శించాలని మంత్రి సవిత ఆదేశించారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ.. హాస్టళ్లను ఉన్నతాధికారులు తరచూ సందర్శించడం వల్ల వార్డెన్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారన్నారు. వార్డెన్లు రాత్రిళ్లు హాస్టళ్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.