మన్యం: జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్టోబరు 1 తేదినే శత శాతం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ బుధవారం అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ చేసిన ఉద్యోగులు పెన్షన్లు సక్రమంగా, సకాలంలో పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యంగా తేదీన శత శాతం పంపిణీకి కృషి చేయాలన్నారు.