NLR: కోవూరు మండలం పెద్ద పడుగుపాడు, ఎన్టీఆర్ మిక్స్డ్ కాలనీ దగ్గరలో ఉన్న ఒక గృహము నందు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేశారు. కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్, సిబ్బందితో కలసి పేకాట ఆడుతున్న 7 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి దాదాపుగా 1,72,580 రూపాయలు నగదు, 1 కారు, 4 మోటర్ సైకిల్లు స్వాధీనం చేసుకున్నారు.