VZM: పండగ పూట రహదారులు రద్దీగా ఉన్న నేపద్యంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గంట్యాడ ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. అంతేకాకుండా తాగి వాహనాలు నడిపితే తప్పనిసరిగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. పండగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.