NLR: ఉద్యోగులకు బకాయిలు ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భోగ్యం శ్రీనివాసులు, గోట్లవేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సీతారామపురం యూటీఎఫ్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం 117 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, లక్ష్మయ్య, మహేశ్ పాల్గొన్నారు.