NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పొదలకూరు మండలం వావింటపర్తిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకుని రెవెన్యూ సదస్సులో పాల్గొంటారని టీడీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు ఆదివారం తెలిపారు. రైతులు, ప్రజలు తమ సమస్యలను రెవెన్యూ సదస్సు దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే కోరినట్లు పేర్కొన్నారు.