W.G: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన 16వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ) సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.