E.G: బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ వినియోగంతోపాటు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు రూ.4.90లు పలికిన గుడ్డు ధర ఇప్పుడు రూ.4.55లకు పడిపోయింది. ఈ ప్రభావం కేక్‌లపై కూడా పడింది. చాలామంది కేక్‌లు తినేందుకు ఇష్టపడడం లేదు. ఉమ్మడి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా, స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది.