ప్రకాశం: నిత్యం యోగ సాధన ద్వారా శరీరంలో అనేక మార్పులు చేకూరుతాయని ఎస్సై మాధవరావు అన్నారు. ఆదివారం హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్సై మాధవరావు పోలీస్ సిబ్బందితో కలిసియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు యోగా చేయటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుందని మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నారు. అంతేకాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని ఆయన తెలిపారు.