ATP: సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీసత్యసాయి ప్రేమదీప్ మందిరంలో 9 మంది పురోహితులతో వేదపారాయణం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పురోహితులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పురోహితులు మాట్లాడుతూ.. సత్యసాయి సేవా సంస్థలలో చేపట్టే సేవా కార్యక్రమాలు అందరికి ఆదర్శమని, స్వామి భక్తులు నిస్వార్థ సేవలు అభినందనీయమని అన్నారు.