ప్రకాశం: పొదిలి పట్టణంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి మార్కాపురం-ఒంగోలు రహదారి’ పై వర్షపు నీరు చేరింది. దీంతో ఆ రహదారి గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.