KKD: జిల్లాలో జులై, ఆగస్టు, సెప్టెంబరుల్లో తుపానులు, భారీ వర్షాలు, వరదల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం అందించినట్లు కలెక్టర్ షాన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 14,428 హెక్టార్లలో వరి, ఉద్యాన పంటలు దెబ్బతినగా, 26,613 మంది రైతు లకు రూ.36కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.