E.G: సీతానగరం మండలం కూనవరం గ్రామంలో ఏర్పాటు చేసిన భూ సమస్యల పరిష్కార వేదికలో ప్రజల వద్ద నుంచి శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రైతులు, ప్రజలందరూ ఈ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూదోపిడిలు, భూ అక్రమాలు పరిష్కరించుకోవాలన్నారు.