EG: ముమ్మిడివరంలో సమగ్ర శిక్షాబియాన్ జిల్లా ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. ముమ్మిడివరం కాశివాని తూము సెంటర్ నుంచి ఎయిమ్స్ కార్యాలయంలో ఉన్న జిల్లా SSA కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. SSAలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు.