చిత్తూరు: చౌడేపల్లి బోయకొండ గంగమ్మ దేవస్థానంలో భక్తులపై క్లీనింగ్ టెండర్ వేసిన వ్యక్తులు దాడి చేశారని భక్తులు ఆలయ ఈఓ ఏకాంబరంకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు భక్తులకు గాయాలైనట్లు తెలిపారు. గాయాలైన భక్తులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఈఓ ఏకాంబరం దర్యాప్తు చేపట్టారు.