ప్రకాశం: పర్చూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య శాలను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్లోని పలు రికార్డులను పరిశీలించారు. హాస్పిటల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఎమ్మెల్యే ఏలూరి సూచించారు.