చిత్తూరు: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ విరుపాక్షి మారెమ్మ గురువారం విశేష పూజలు అందుకుంది. ఉదయాన్నే అర్చకులు ఫల పంచామృతాలతో అమ్మవారి మూలవరులను అభిషేకించి, పసుపు, వివిధ పుష్పాలు, నిమ్మకాయ హారాలతో ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత శేష పూజలు నిర్వహించారు.