ASR: డౌనూరు పాఠశాల విద్యార్థి కే.సురేష్ ఆరోగ్యం బాగానే ఉందని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ శుక్రవారం తెలిపారు. విద్యార్థిని ఆసుపత్రికి తరలించేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో పోలీసుల సహకారంతో కేజీహెచ్‌కు తరలించామని, ప్రస్తుతం విద్యార్థికి వైద్యం అందుతుందన్నారు. విద్యార్థికి వైద్యం అందేవరకు తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లకుండా పోలీసు కాపలా ఏర్పాటు చేశామన్నారు.