CTR: పెనుమూరు మండలంలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం పర్యటించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ద్వారా పల్లెలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.