SKLM: ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ లో పీజీ డిప్లొమా ఇన్ గాంధీయన్ సోషల్ వర్క్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల వ్యవధి గల ఈ కోర్సులో చేరేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.