NDL: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ మండల కేంద్రంలో నిర్వహించిన 21వ అఖిల భారత పశుగణన సర్వేను సోమవారం పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా.రమణయ్య పరిశీలించారు. రైతులు ప్రతి ఒక్కరూ పశుగణనకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని డీడీ రమణయ్య పేర్కొన్నారు. ఏడీ డా.కొండారెడ్డి, LSA సద్దామ్ పాల్గొన్నారు.