ASR: పల్లెలు అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నారని టీడీపీ అనంతగిరి మండల కార్యదర్శి టీ.ఆనంద రావు, ఉపాధ్యక్షులు దోన్ను అన్నారు. మండలంలోని కోనాపురం పంచాయితీ చప్పడి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉపాధి హామీ పథకం నిధులు 4.87 లక్షల అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.