కడప: నగరంలో వర్షం కారణంగా నిలిచిపోయిన నీటిని తొలగించే ప్రక్రియను అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇంఛార్జ్ మున్సిపల్ కమిషనర్ నందన్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వర్షపు నీరు పోయే విధంగా ప్రత్యేకమైన డ్రైనేజీ నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించారు. వర్షపు నీరు తొలగించుటకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.