KDP: కడప నగర టీడీపీ అధ్యక్షుడిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని టీడీపీ మైనార్టీ నాయకుడు అమీర్ బాబు అభ్యర్థించారు. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్కూటర్ మీద వచ్చి మారణాయుధాలతో పట్టపగలే దాడి జరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.