NTR: ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. ఎన్డీఆర్ జిల్లాలో మొత్తం 17,04,611మంది ఓటర్లు ఉన్నారు. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి 2,07,468మంది ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో పురుషులు 1,02,131.. మహిళలు 1,05,331.. థర్డ్ జెండర్ 06 మంది ఉన్నారు. నవంబర్లో అభ్యంతరాలు స్వీకరించి.. వచ్చే ఏడాది 6న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.