NTR: తిరువూరులోని లక్ష్మీపురం మను గార్డెన్స్‌లో ఈ నెల 24 గురువారం ఉదయం 10.గంటలకు కూటమి నాయకుల, కార్యకర్తల విస్త్రతస్థాయి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అద్యక్షతన సమావేశం జరగనున్నట్లు మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించనున్నారు. నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.