ASR: పెదబయలు మండలం బంగారుపుట్టులో తాగునీరు సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. గ్రామంలో సుమారు 200 మంది నివాసం ఉంటున్నామని తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కిలోమీటర్ కాలినడకన వెళ్లి ఊటగడ్డ నీరు తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.