KRNL: ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్ లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ ప్రవేట్ క్లినిక్‌కు ప్రాధాన్యత ఇస్తున్న డాక్టర్ మైత్రేయిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సిరికి వినతిపత్రం అందజేశారు. గర్భిణీ నవజాత శిశువు ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మా కొడుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు.