బాపట్ల: కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల పీహెచ్సీ పరిధిలో పరిధిలో గురువారం క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించి వైద్య శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని, వ్యాధిని ముందుగానే గుర్తించి ముదరక ముందే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు.