BJPపై జార్ఖండ్ CM హేమంత్ సోరెన్ విరుచుకుపడ్డారు. ధైర్యం ఉంటే ముందుకొచ్చి పోరాడాలని, బ్రిటీష్ వారిలా వెనక నుంచి దాడి చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో 13 వేల స్కూళ్లు ఎందుకు మూతపడ్డాయని, 11 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఎందుకు రద్దయ్యాయని నిలదీశారు. తమ రాష్ట్రం విద్యుత్‌ను బంగ్లాదేశ్‌కు ఎందుకు విక్రయించారంటూ మండిపడ్డారు. ఇక జార్ఖండ్‌లో ఈ నెల 13, 20న 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.