GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న “ప్రజా పోరు” నిర్వహిస్తున్నట్లు C.P.M నగర కార్యదర్శి నళినీకాంత్ వెల్లడించారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ప్రజాపోరు కరపత్రాలను నళినీకాంత్ ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెల 11న గుంటూరు కలెక్టరేట్ వద్ద ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.