అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థలపైనా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మూడేళ్ల పాటు నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భవిష్యత్తులో మూడేళ్ల పాటు ఈ కంపెనీ ఎస్ఈసీఐ నిర్వహించే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు వీలుండదు.