పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన వివాదాస్పద బాక్సర్ ఇమానె ఖెలిఫ్.. తన హెల్త్ రిపోర్టును లీక్ చేసిన సదరు మీడియాపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు ఐఓసీ తెలిపింది. ‘ఇమానె ఖెలిఫ్ చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని మేం అర్థం చేసుకుంటున్నాం. వైద్య నివేదికలు వాస్తవమా ? కాదా ? అని తెలియకుండా బయటకి వెల్లడించినందుకే ఖెలిఫ్ చర్యలు తీసుకుంటుంది. ఆమె తీసుకుంటున్న చర్యలపై మేము ఎలాంటి కామెంట్ చేయం’ అని ఐఓసీ తెలిపింది.