VZM: గుర్ల మండలంలో డయేరియా పరిస్థితులపై టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున బుధవారం జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడి వ్యాధులు రావటానికి గల కారణాలను ఆయనకు వివరించారు. పరిస్థితులు నియంత్రించి పూర్వస్థితికి తీసుకురావాని కోరారు. గ్రామీణనీటి సరఫరా, వైద్య ఆరోగ్యశాఖల అధికారులను అప్రమత్తం చేసి డయేరియా సోకిన రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.