Akp: యలమంచిలి మున్సిపాలిటీ రాంనగర్ లో గల టిడ్కో కాలనీలో శనివారం స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, స్థానికులు కలిసి కాలనీ పరిసరాల్లోని పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. మున్సిపల్ చైర్ పర్శన్ రమాకుమారి మాట్లాడుతూ వారంలో ఒకరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.